చంద్రబాబు క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మరో నలుగురు నేతలు

- February 07, 2017 , by Maagulf
చంద్రబాబు క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మరో నలుగురు నేతలు

ఉగాదికి ముందు జరిగే చంద్రబాబు క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ భాగంగా నలుగురు నేతలు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే లోకేష్ బెర్త్ ఖాయంకాగా, మరో ముగ్గురు నేతలు ఎవరన్నది ఆసక్తిగా మారింది. విశ్వసనీయ సమచారం మేరకు ఆ ముగ్గురు వైసీపీ నుంచి వచ్చిన తెలుగుదేశం నేతలని తెలుస్తోంది. అమరనాథ్‌రెడ్డి (చిత్తూరు జిల్లా), సుజయ్ రంగారావు (విజయనగరం), భూమానాగిరెడ్డి (కర్నూలు).. ఈ ముగ్గురినీ కేబినెట్‌లో తీసుకోవాలని చంద్రబాబు ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఐతే ప్రతిపక్ష పార్టీ తరపున గెలిచి క్యాబినెట్ మంత్రిగా చెలామణి అవడమనేది ఇక్కడ ఎదురయ్యే తొలి సమస్య. దీనికి కూడా చంద్రబాబు పరిష్కారాన్ని సిద్ధం చేసుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించిన తర్వాత మంత్రులుగా ప్రమాణ పత్రాల్ని చదవించాలన్నది బాబు ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో జరిగే బైపోల్‌లో 'ముగ్గురు మంత్రుల్ని' గెలిపించుకోవడం పార్టీ భుజాల మీద వుండే భారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com