'యూత్ ఐకాన్' దేవినేని అవినాష్ తో మాగల్ఫ్.కామ్ వారి ముఖాముఖి

- February 07, 2017 , by Maagulf
'యూత్ ఐకాన్'  దేవినేని అవినాష్ తో మాగల్ఫ్.కామ్ వారి ముఖాముఖి

'యూత్ ఐకాన్'  దేవినేని అవినాష్  యు.ఏ.ఈ విచ్చేసిన సంధర్బముగా మాగల్ఫ్.కామ్ వారితో ముఖాముఖి.


ప్ర) ప్రస్తుత రాజకీయాల్లో యువత పాత్ర ఎంత? 


జ)  ప్రస్తుత రాజకీయాల్లో గతంతో పోలిస్తే 2009 నుండి యువత పాత్ర చాలానే ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వారి పాత్ర మనకి దృఢంగా కనిపిస్తోంది ఉదాహరణకి అన్న హజారే మూవ్మెంట్ కానివ్వండి మొన్న జరిగిన జల్లికట్టు పై నిరసన విషయంలో కానివ్వండి యువత ముందుండి ఆ ఒక్క అంశాన్ని ముందుకు తీసుకువెళ్లి విజయం సాధించటం చూశాం. ఇవన్నీ చూస్తుంటే యువత రాజకీయాలకి ఆకర్షితులవుతున్నారు అని అనిపిస్తోంది. యువతకి  రాజకీయాలపై ఇంకా అవగాహన పెరగాలి. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు నూతన రాజకీయ ఒరవడిని నేర్చుకొని సరైన విధంగా దేశ మరియు రాష్ట్ర రాజకీయాలని ముందుకు తీసుకు వెళ్తారని భావిస్తున్నాను. ఈ రోజు 25 ఏళ్లకే నేను రాజకీయాలలోకి వచ్చాను, నాతోపాటు అనేకమంది 25 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లకే ఎంపీ లు గా కూడా అవ్వటం జరిగింది. ఈ విషయంలో మనం ముఖ్యంగా అభినందించాల్సింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. యువతకి ప్రోత్సాహం బాగా ఇస్తారు. ఒకపక్క రాజకీయంగా మరోపక్క అభివృద్ధి పరంగా, ఉద్యోగ అవకాశాల్లో గాని రాజధాని నిర్మాణం లో గాని వారు యువతికి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు అని ఈ సంధర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.


ప్ర) రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టేది యువతే, కానీ ఆ యువత రాజకీయాల పట్ల అంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారా? 


జ)  ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోనుండి తెలుగుదేశం పార్టీలోకి రావటానికి అనేక కారణాలున్నాయి. అదేరకంగా ఇంకోపక్క చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే 1982 నుండి రామారావు గారు పార్టీ స్థాపించినరోజు దెగ్గరనుండి ఆయన మరణించినప్పటి దాకా కూడా తెలుగుదేశం పార్టీలో మేము ఉండటం జరిగింది. ఆనాడు వన్ అఫ్ ది ఫౌండర్ మెంబెర్ గా జండా రూపొందించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఉండటం జరిగింది. అదేవిధంగా కృష్ణాజిల్లా లో తెలుగుదేశం పార్టీని 1982 - 1996 దాక కూడా ఆయన భుజాలమీద మోసుకొని జిల్లా మొత్తంకూడా నడిపించారు. 1994 లో 17 సీట్లకి 15 సీట్లు గెలిపించి జిల్లా లో తెలుగుదేశం పార్టీ రావటానికి ఎంతో కృషిచేశారు. ఆనాడు ఆలా పనిచేయటం ఈనాడు మేము రాజకీయాల్లో ఇలా ఈ స్థాయిలో ఉండటం కేవలం ఎన్.టి.ఆర్ గారు పెట్టిన భిక్షే అని ఈరోజు ఈ సంధర్భం లో చెప్పుకోదలుచుకున్నాను. దానితరువాత కొన్ని కారణాలవల్ల కాంగ్రెస్ పార్టీ లోకి మారినా మళ్లీ సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మా యువనాయకుడు నారాలోకేష్ గారు కానివ్వండి వాళ్లు మాట్లాడే విధానం చేసే విధానం మెచ్చి, నచ్చి అదేవిధంగా నూతన రాజధాని అమరావతి కేంద్రంగా ఏదైతే రాజధానిని చంద్రబాబు గారు రూపొందిస్తున్నారో అహర్నిశలు ఏవిధంగా అయితే శ్రమిస్తున్నారో అవన్నికూడా చూసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ లోకి అడుగుపెట్టటానికి సంతోషం మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి రాజధాని గా ఏదైతే ఆయన నిర్మించాలి అని అనుకుంటున్నారో దానికి తోడుగా ఆయన వెనకాల ఒక సైన్యంగా ఈరోజు ఆయన అడుగులో అడుగు వేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ మాకు పాత పార్టీనే ఇప్పటికి అది మా సొంత ఇల్లే. ఏవిధంగా అయితే ఒక అన్న తమ్ముడు గొడవై మళ్లీ కలిసిపోతారో అదే విధంగా మేము తెలుగుదేశం పార్టీలో మళ్లీ కలవటం జరిగింది. ప్రజాబలం అంతాకూడా మాపక్కన ఉండటంవల్ల మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడతాం అని ఈ సందర్భంగా చెప్పదలచుకున్నాను.


ప్ర)  కొత్త రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎలాంటి అవకాశాలున్నాయి? 


జ) కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు గారి నాయకత్వంలో చాలామంచి భవిష్యత్తు ఈ ఒక రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా ఏదైతే యువత ఉందొ విద్యార్థులు ఉన్నారో అందరి భవిష్యత్తు చంద్రబాబు గారు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు అని ఈ సందర్భంగా నేను చెప్పదలచుకున్నాను. అలాగే 2014 లో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆనాడు నేనుకూడా రాష్ట్ర విద్యార్థి సంగం అధ్యక్షుడిగా ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొనటం జరిగింది. కానీ తరవాత మళ్లీ మేము అనుకున్నాం ఎవరైతే రాజకీయనాయకులు, ఎంపీలు ఉన్నారో వాళ్ల స్వలాభంకోసం రాష్ట్రాన్ని విడగొడ్తున్నారు అయినా మేము కాంగ్రెస్ పార్టీ లో ఉండి కూడా పార్టీ కి వ్యతిరేకంగా పోరాడటం జరిగింది. అప్పుడు మేము అనుకున్నాం విడగొడ్తున్నారు కానీ ఒక పెద్దమొత్తం నిధులు ఈ ఒక్క రాష్ట్రానికి ప్రకటిస్తారు తప్పకుండా రేపు ఏ ప్రభుత్వం వచ్చిన వారు ఏదైతే ప్రకటించారు దానికి అనుగుణంగా రాష్ట్రం ముందుకువెళ్తుంది అని అందరం ఆశించాం. కానీ ఎటువంటి ప్యాకేజీలు ప్రకటించకుండా నిలువునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తం జరిగింది. కానీ నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడే వ్యక్తులుగా మేము ఆ పార్టీలో చాలాకాలంగా కొనసాగినా చంద్రబాబు గారు  ఏవిధంగా అయితే కష్టపడ్తున్నారో చూసి ఆయనకి తోడు అవ్వాలని ఆయనపక్కన చేరటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని గా అమరావతి ని సృష్టించి దాదాపుగా ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక పక్క ప్రజా సంక్షేమపథకాలు మరోపక్క ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబందించిన కార్యక్రమాలే కానివ్వండి రెండిటిని సమానంగా ఆయన నాయకత్వంలో ఆంధ్ర రాష్టం ముందుకువెళ్తోంది అని ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. ఏదైతే మొన్న దావూస్ వెళ్లి దాదాపుగా ఎన్నో వేల కోట్ల నిధులు మరియు ప్రాజెక్టులు మన రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. అనేక కంపెనీలు ఈరోజు  పెట్టుబడులు పెట్టడానికి ఆంద్ర రాష్ట్రంవైపు చూస్తున్నాయి. తమిళనాడు, కేరళ, తెలంగాణలతో పోల్చుకుంటే లోటు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రం ఈ మూడు రాష్ట్రాలతో పోటీ  పడేవిధంగా చంద్రబాబు గారు మన రాష్ట్రాన్ని ముందుకుతీసుకు వెళ్ళటానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి కొత్త రాష్ట్రం అమరావతి నూతన రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ఆయన నాయకత్వంలో ముందుకువెళ్తుందని నేను ఈ సందర్భంలో చెప్పదలచుకున్నాను.

ప్ర) తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు?


జ) తెలుగుదేశంపార్టీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి మనంకనక చూసుకుంటే ఇందాకనేను చెప్పిన విధంగా ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమపథకాలు చూసుకుంటూ మరోపక్క ఈ ఒక్క నూతన రాజధానిని అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోంది. మనంకనక చూసుకుంటే సంక్షేమ పథకాలు ఈ రోజు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం జరిగింది, వికలాంగుల పెన్షన్ 1500 కు చేయటం జరిగింది, వితంతువుల మరియు వృద్దుల పెన్షన్ 1000 రూపాయలకు పెంచటం జరిగింది ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటూ ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి యువతకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఇవన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు వెళ్తోంది. అదేవిధంగా పోలవరం కానివ్వండి పట్టిసీమ కానివ్వండి  ఒక పక్క రైతాంగం గురించికూడా ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2014  నుండి ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రం ప్రతివిషయంలో ముందుకు వెళ్తోందని ఈరోజు నేను ఘంటాపరంగా చెప్పదలచుకున్నాను.


ప్ర) కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి? 


జ) కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకి ఒక యువకుడిగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాడిగా నేను ఇచ్చే సందేశం అయితే తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి లో మనం అంట భాగస్వామ్యులు అవుదాం, చంద్రబాబు గారు లోకేష్ ల నాయకత్వంలో మనమందరం కలిసి పనిచేద్దాం తప్పకుండా మన యువత అందరికి కూడా తెలుగుదేశం పార్టీ లో కానివ్వండి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ప్రతి యువకుడుకి రేపు వాళ్ల భవిష్యతు అంట కూడా బంగారు మయం అయ్యేలాగా చంద్రబాబు గారు కష్టపడ్తున్నరు. అదేవిధంగా మనం అందరంకూడా భాగస్వామ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా భారతదేశానికి మనం చేయగలిగే సేవ మనందరం కలిసి చేయాలి. ఈరోజు విదేశాల్లో ఎంతోమంది యువత ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు అలాగే చాలామంది అమెరికా, దుబాయ్ వంటి ప్రాంతాల్లో మనవాళ్ళు స్థిరపడ్డారు మీరందరు కూడా అక్కడ చంద్రబాబు గారు ఏవిధంగా అయితే కాష్టపడ్తున్నారో ఆ కష్టానికి మీరందరుకూడా తోడవ్వాలని అలాగే ఆయన ఏదైతే గ్రామళ్లను దత్తతు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నారో మీరుకూడా అందులో తప్పకుండా భాగస్వామ్యులు కావాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి మీరందరు సహకారం కూడా కావాలని ఈరోజు నేను మీ అందరిని కోరుకుంటున్నాను.

ప్ర) విజయవాడ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కిందే లెక్క. గతానికీ, ఇప్పటికీ విజయవాడలో వచ్చిన మార్పులు ఏమిటి?  భవిష్యత్‌ విజయవాడ ఎలా ఉండబోతోంది? 


జ)  విజయవాడ కూడా నూతన అమరావతి రాజధానిలో ఒక అంతర్భాగమే.విజయవాడని కూడా గతంలో ఎంతోమంది పాలకులు వచ్చారు, పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గత 5 సంవత్సరాలు అనగా 2009 - 2014 దాక ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎవరైతే ఎంఎల్ఏలు ఉన్నారో మంత్రులుగా పనిచేశారో వలందరు కూడా విజయవాడని కృష్ణా జిల్లాని దీన అవస్థకి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా విజయవాడలో నూతన రాజధాని యొక్క దృశ్యం కానివ్వండి ఒకపక్క హ్యాపీ సండేస్ లాంటి వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, రాత్రిపూట ఇదివరకు 12 గంటలు తరవాత నైట్ కల్చర్ అనేది విజయవాడ కి తెలీయదు అలాంటిది ఈరోజు రాత్రిపూట ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటుచేయడం కానివ్వండి విజయవాడకి ఒక రాజధాని లుక్ తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. తప్పకుండా ఆయన హయాంలో విజయవాడ మరియు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీకూడా అభివృద్ధి చెంది ఏవిధంగా అయితే ఒక రైల్వే స్టేషన్ ఒక బస్సు స్టేషన్ కి విజయవాడ యొక్క పేరుచెబితే గుర్తుకొస్తాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో విజయవాడ అంటే ఈ ఒక్క దేశంలోనే అత్యున్నతమైన రాజధాని అనేక విధాలుగా అభివృద్ధిచెందిన ప్రాంతంగా తప్పకుండా మనంఅందరంకూడా చూడబోతున్నాం రేపు భవిష్యత్తులో తప్పకుండా మరొక పది సంవత్సరాలు చంద్రబాబు గరే అధికారంలో ఉంటారు ఆయన నాయకత్వంలో నారాలోకేష్ గారి సమన్వయంతో విజయవాడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనంకనక  చూసుకుంటే ఈ రెండున్నర సంవత్సరాల్లో విజయవాడలో అనేక సమస్యలు అంతకముంది ఉన్నాయ్ అవన్నికూడా ఈరోజు నారాచంద్రబాబు గారి నాయకత్వంలో తీరుస్తాం జరిగింది. ఒకపక్క ఎంపీలు కానివ్వండి ఎంఎల్ఏలు కానివ్వండి అహర్నిశలు ఈరోజు ప్రజల సమస్యలను పరిష్కారించటం జరిగింది. ఎన్నోయేళ్లగా పరిష్కారంకాని సమస్యలు ఈ ఒక్క రెండున్నర సంవత్సరాల కాలంలో పరిష్కారమయ్యాయి. లోటు బడ్జెట్లో ఉన్న మన విజయవాడ నగరపాలక సంస్థని ఈరోజు అన్నివిధాలుగా బడ్జెట్ పుష్కలంగా ఉండేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, ఎంఎల్ఏలు కలిసి పనిచేసారు. ఇదే స్పూర్తితో రేపు రాబోయే రోజుల్లోకూడా విజయవాడ అభివుద్ది కోసం పాటుపడతాం అని సెలవుతీసుకుంటున్నా.
అమరావతిలో విజయవాడ అంతర్భాగమా? విజయవాడనే పేరు మార్చుకుని అమరావతిగా వర్ధిల్లబోతోందని అనుకోవచ్చా? 


ప్ర) తెలుగుదేశం పార్టీ నేతగా, రాష్ట్ర ప్రజలకు మీరిచ్చే సందేశమేంటి?


జ)  తెలుగుదేశం పార్టీ నేతగా రాష్ట్ర ప్రజలకి నేను ఇచ్చే సందేశం ఒక్కటే తప్పకుండా మనకోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు, మనమందరం కూడా ఆయనకి తోడు ఉండాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వామ్యులు అవ్వాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఎన్నో ప్రతిపక్ష పార్టీలున్నాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఏమి చేయలేక ఏదోచేయాలి ఇదొక నింద వేయాలని చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. వీళ్లందరి దగ్గర నుంచి ప్రజలందరూ కూడా వాళ్లకు వాళ్లు కూపాడుకుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటే ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనంకూడా భాగస్వామ్యులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరుపేరునా మీ అందరికి ధన్యవాదములు తెలుపుకుంటూ అదేవిధం గా ఈరోజు దుబాయ్ లో మాగల్ఫ్.కామ్ పేరుతో తెలుగు వారికి అన్నివిధాలుగా రాజకీయాలుగానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ గల్ఫ్ కి ఒక వారధిగా ఉంటున్న మాగల్ఫ్.కామ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు గారికి నా ఒక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com