తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే జీతం కట్.!!
- February 08, 2017
తల్లిదండ్రుల బాధ్యతలను పట్టించుకోకపోతే ఇకపై ఉద్యోగుల జీతం కట్ కానుంది. ఈమేరకు ఓ చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పిల్లలను కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనేక బాధలు పడుతున్నారు. ఆస్తులు దక్కించుకున్న కొడుకులు ఆ తర్వాత వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో నేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు మలి వయసులో అష్టకష్టాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో అసోం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పేరెంట్స్ పట్ల నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తం మినహాయించనుంది. దీన్ని తల్లిదండ్రుల సంరక్షణకు వినియోగించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అసోం ఆర్ధిక మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







