శివరాత్రికి పేలనున్న లక్ష్మీ బాంబ్...
- February 09, 2017
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాల కృష్ణ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీ బాంబ్. గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో మంచు లక్ష్మీ జడ్జ్ పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పటి వరకు మంచు లక్ష్మీ చేయని పవర్‌ఫుల్ రోల్‌లో ఆమెను దర్శకుడు ప్రెజెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మనోజ్ ఫైట్ మాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే.
మహిళల సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని రూపొందిన లక్ష్మీ బాంబ్ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఈ చిత్ర విడుదల కొన్నాళ్ళుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నది.
ఇప్పుడు ఆ సమస్యలన్నింటిని అధిగమించి మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం మంచు లక్ష్మీ కెరియర్ కి చాలా ఉపయోగపడుతుందని టీం భావిస్తున్నది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







