'నూడుల్స్ అండ్ వెజ్ కట్లెట్'
- April 20, 2015
స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ప్రతిరోజు ఏమేం వెరైటీ పెట్టాలా అని ఆలోచించే తల్లులకు కోసం చక చకా తయారయ్యే ఒక రెసిపీ: 'నూడుల్స్ అండ్ వెజ్ కట్లెట్'.
కావలసిన పదార్ధాలు:
- నూడుల్స్ - 1 ప్యాకెట్ ( మసాలా పొడి తో)
- బంగాళదుంప - 1 (చిన్నది)
- కార్రట్ తురుము - 1/4 కప్పు
- కసూర్ మేతి - 1/4 టీ స్పూను
- వరి పిండి - 1 టీ స్పూను
- కార్న్ ఫ్లౌర్ - 1 టీ స్పూను
- అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూను
- బ్రెడ్ పొడి - 1/2 కప్పు
- ఆయిల్ - వేయించటానికి సరిపడా
- ఉప్పు - తగినంత
చేయు విధానం:
- ముందుగా ఒక చిన్న బౌల్ లో ఉడికించిన నూడుల్స్, ఉడికించి చిదిమిన బంగాళదుంప, నూడుల్స్ ప్యాకెట్ తో ఇచ్చిన మసాలా,కార్రట్ తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద, కసూర్ మేతి, వరి పిండి, కార్న్ ఫ్లౌర్, ఉప్పు వేసి అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఆ మిశ్రమంతో చిన్న చిన్న ముద్దలుగా (మీకిష్టమైన షేప్స్) లో చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఈ కట్లెట్స్ ను బ్రెడ్ పౌడర్ లో అద్ది ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవటమే.
---- శ్రీ వాణి, దుబాయ్, యు ఏ యీ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









