'హీరో ధనుష్ మా కొడుకే.. ఆధారాలు చూపిస్తాం'..

- February 10, 2017 , by Maagulf
'హీరో ధనుష్ మా కొడుకే.. ఆధారాలు చూపిస్తాం'..

హీరో ధనుష్ మా కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం లేదని మేలూర్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే తాను వాళ్ల కొడుకును కాదని, తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని, అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్ కే రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
దీనికి బదులుగా ఆ దంపతులు.. ధనూష్ 1985 నవంబర్7న మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇరువురు జనన ధృవీకరణ, విద్యా సంబంధ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది.

కేసును ఈ నెల 14కు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com