సుమకు షాకిచ్చిన కీరవాణి..
- February 10, 2017
సుమా కనకాల.. యాంకర్ గా, వ్యాఖ్యాతగా, నటిగా, డ్యాన్సర్ గా, గాయనిగా మల్టీ టాలెంటెడ్ పర్సన్.. కానీ సుమ నేర్చుకొన్న నృత్యాన్ని, సంగీతాన్ని ఎప్పుడూ పూర్తి స్థాయిలో ప్రదర్శించలేదు.. కానీ బుల్లి తెరపై యాంకర్ గా మకుటం లేని మహారాణి... యాంకర్స్ లో సెలబ్రేటీ సుమ... కాగా సుమ ని బుల్లి తెరపై ఓ షో కోసం సింగర్ గా కుంచే రఘు పరిచయం చేశాడు..
యాంకర్ సుమ ఇప్పుడు వెండి తెరపై కూడా సింగర్ గా అడుగు పెట్టింది.. విన్నర్ సినిమాలో "సుయ సుయ" సాంగ్ ని సుమ తో సంగీత దర్శకుడు థమన్ పాడించారు.. ఈ పాట విన్న వారు సుమ మంచి సింగర్ అంటూ ఓటు కూడా వేస్తున్నారు.. దీంతో సుమలోని కొత్త టాలెంట్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ హాట్ టాపిక్.. తాజాగా కీరవాణి నుండి ఆఫర్ అందుకొన్నది అనే టాక్ వినిపిస్తోంది. కీరవాణి సంగీత దర్శకత్వంలో పాట పాడడం గాయకులు గొప్పగా ఫీల్ అవుతారు.. అలాంటి ప్రత్యేకత కలిగిన కీరవాణి స్వయంగా సుమకు సింగర్ గా ఛాన్స్ ఇవ్వడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







