'ఓం నమో వేంకటేశాయ' రివ్యూ..
- February 10, 2017
నాగ్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఎన్ని చిత్రాలు వచ్చినా మొదట గుర్తు వచ్చే చిత్రం 'అన్నమయ్య' . వరస కమర్షియల్ సినిమాలు చేస్తున్న దర్శకేంద్రుడు అప్పట్లో హఠాత్తుగా రూటు మార్చి భక్తిరస చిత్రం అందించి అద్బుతం అనిపించుకున్నారు. ఆ తర్వాత భక్త రామదాసు వచ్చినా, శిర్డీ సాయిబాబా అన్నా ఆ స్దాయి అప్లాజ్ రాలేదు.
అయితే మళ్లీ ఇంతకాలానికి వెంకటేశ్వరస్వామి భక్తుడు కథతో 'ఓం నమో వేంకటేశాయ' కాంబినేషన్ రిపీట్ అవుతోందనగానే 'అన్నమయ్య' స్దాయిలో ఉండే సినిమా వస్తుందని ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ ఎక్సపెక్టేషన్స్ ని 'ఓం నమో వేంకటేశాయ' అందుకుందా అంటే కొంతవరకూ మాత్రమే అని చెప్పాలి.
అయితే సినిమాలో మనకు ఆసక్తి కలిగించే అనేక స్వామివారికి సంభందించిన అనేక విశేషాలు,తిరుమలలో నిత్యం ఆచరించే ఆచారాలు గుది గుచ్చి అందించటం మాత్రం అద్వితీయం అనిపిస్తుంది.
భక్తికున్న శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం బాబా కథ ఇది. అయితే కథ జనాలకి పెద్దగా తెలిసింది కాకపోవటం కలిసి వచ్చింది. దాంతో ఫ్రెష్ గా ఓ కొత్త సినిమా చూస్తున్న ఇంపార్ట్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టులా నిలిచింది. ముఖ్యంగా నాగార్జున ఫెరఫార్మెన్స్ ఆయన అభిమానులను మాత్రమే సినీ లవర్స్ చేత కూడా శభాష్ అనిపిస్తుంది. ఇంతకీ ఈ చిత్రం కథ ఏమిటి... హైలెట్స్,మైనస్ లు క్రింద రివ్యూలో చూద్దాం...
ఆ వయస్సులోనే తపస్సు
ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతుంది. 16 శతాబ్దానికి చెందిన రామ్ (నాగార్జున) చిన్నతనం నుంచీ దేవుడిని చూడాలనే కోరికతో జ్వలిస్తూంటాడు. దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ చిన్నతనంలోనే ఇంట్లోంచి బయిటకు వచ్చి...తిరుమలలోని గురువు పద్మానంద స్వామి (సాయికుమార్) నడుపుతున్న వేద పాఠశాలలో చేరుతాడు. అక్కడే విద్య అభ్యసిస్తూ..ఆయన చెప్పిన మాటతో తపస్సుకు సైతం పూనుకుంటాడు.
గుర్తించలేపోతాడు
రామ్ చేసే తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కానీ దేవుడ్ని అప్పుడు గుర్తించలేకపోతాడు. తర్వాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్ళీ దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడున్న కొంతమంది వలన దేవుడిని చేరుకోలేకపోతాడు.
కృష్ణమ్మ తో ..
ఆ క్రమంలోనే మరో వెంకటేశ్వర సామి భక్తురాలు కృష్ణమ్మ (అనుష్క) ను కలుస్తాడు. ఆమెతో కలిసి తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని, క్షేత్రాన్ని వైకుంఠంగా అభివృద్ధి చేస్తూంటాడు. అతని భక్తికి ముగ్దుడైన వెంకటేశ్వర స్వామి మరోసారి అతనికి దగ్గరై అత్యంత ఆప్తుడిగా మారిపోతాడు.
స్వామీ పరీక్ష
తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్) ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి విధులు నిర్వర్తించటం లేదని రామ ప్రశ్నిస్తాడు. దాంతో గోవిందరాజులు... రామపై ఎందుకు కక్ష కడతాడు. మరో ప్రక్క రామను పరీక్షించాలని స్వామి నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో రామ జీవితంలో రకరకాల అనుభవాలు ఎదురవుతాయి.
నగలు ఓడిన స్వామివారు
రామ యొక్క భక్తి శ్రద్దలు చూసిన స్వామివారు...మొదట ఆయన కలలోనూ ఆ తర్వాత నిజ జీవితంలోనూ కనపడతారు. అంతేకాకుండా రామతో పాచికలు ఆడతారు. అలా రామా వద్ద స్వామి వారు పాచికల పందెంలో తన నగలు మొత్తం ఓడుతారు. అదే సమయంలో స్వామి వారి నగల దొంగతనం గుడిలో జరుగుతుంది. దేవాలయ అధికారులు దృష్టి, అనుమానం రామ వారిపై పడుతుంది.
ఖైదు చేయమని రాజాజ్ఞ
ఆ క్రమంలో రామా నివాసం ఉంటున్న ఆశ్రమం పై ఆ నగల కోసం దాడి చేస్తారు. అక్కడ ఆ ఆశ్రమంలో రామ వద్ద స్వామి వారి నగలు దొరుకుతాయి. దాంతో అప్పటి రాజు...రామాని ..ఖైదు చేయమని ఆజ్ఞాపిస్తాడు.
హాధీరాం బాబాగా ఎలా ...
ఈ స్వామి భక్తుడు కథలో భవానీ (ప్రగ్యాజైస్వాల్) పాత్రేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? అసలు ...రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







