ఫిఫా అండర్-17 ప్రపంచకప్ మస్కట్!
- February 10, 2017
భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న అండర్-17 ఫుట్‌బాల్ ఫిఫా ప్రపంచకప్ పోటీల అధికారిక మస్కట్ విడుదలైంది. న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 'ఖేలియో'ను కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌గోయల్, స్థానిక క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌లు విడుదల చేశారు. దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే చిరుతను ఈ క్రీడలకు మస్కట్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి గోయల్ మాట్లాడుతూ.. 'భారత్‌లో జరిగిన క్రీడా కార్యక్రమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ మస్కట్ గుర్తిండిపోతుంది.
'ఖేలియో' యంగ్, వైబ్రెంట్, ఉత్సాహభరితం దేశాన్ని ప్రతిబింబించేందుకు ఇదే సరైనది. ఫుట్‌బాల్ క్రీడ మరింత ఉత్సాహంగా జరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది' అని అన్నారు.
2017 సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్‌లోని ఆరువేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ ప్రపంచకప్‌లో భారత్ సహా 24 జట్టు పాల్గొంటాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







