ఒమన్ లో 9.990 సైకోట్రోపిక్ మాత్రలు స్వాధీనం

- February 11, 2017 , by Maagulf
ఒమన్ లో  9.990 సైకోట్రోపిక్ మాత్రలు స్వాధీనం

మానసిక రోగుల కోసం వైద్యులచే సూచించబడిన మందులను సైతం మత్తుబాబుల కిక్ కోసం అక్రమంగా ఉపయోగించుకొంటున్నారని తెలుస్తుంది. అటువంటి దాదాపు 10,000 సైకోట్రోపిక్ మాత్రలు   కలిగిన ఒక బ్యాగ్ ను ముసణ్డం సముద్రతీరంలో రాయల్ ఒమన్ పోలీసులు కనుగొన్నారు. సలమా దీవులు సమీపంలో ముసణ్డం సముద్ర తీరంలో రాయల్ ఒమన్ పోలీసులు డిపార్ట్మెంట్ నార్కోటిక్స్ కంట్రోల్ యొక్క, కోస్ట్ గార్డ్స్ సహకారంతో, నార్కోటిక్స్ తో నిండిన పూర్తి సంచి సముద్రంలో సమీపంలో ఈ బ్యాగ్ ని స్వాధీనం చేసుకొన్నారు.ఆ బ్యాగ్  కనుగొన్న తర్వాత, ఆ సంచిలో 9.990 మాత్రలు లభ్యమైనట్లు రాయల్ ఒమన్ పోలీసు అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com