మహేష్ సినిమా 'రంజాన్' కానుకగా...

- February 12, 2017 , by Maagulf
మహేష్ సినిమా 'రంజాన్' కానుకగా...

మహేష్ బాబు - మురగదాస్ కలయికలో 'సంభవామి' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన ముంబై, పూణే షెడ్యూల్స్ పూర్తయితే షూటింగ్ పూర్తయినట్టే.
ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'సంభవామి' తెలుగుతో పాటుగా తమిళ్, హిందీలోనూ రిలీజ్ కానుంది. దీంతో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు మురగదాస్.
మహేష్ 'సంభవామి'ని రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. బాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేయాలంటే రంజాన్ మంచి సీజన్ అన్నది మురగదాస్ ప్లాన్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి రంజాన్ కి ఓ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాడు. ఈసారి కూడా ఆయన ట్యూబ్ లైట్ తో రంజాన్ కి రానున్నాడు. ఈసారి సల్మాన్ కి పోటీగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగనున్నాడు.
ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com