నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- June 30, 2026
నంద్యాల: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహిస్తున్న నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలోని పదవుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మంగళవారం రెండో రోజు నంద్యాలలో కొనసాగింది.
నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో 27 మంది సభ్యులతో కూడిన సమాచార సేకరణ కమిటీ బృందం నంద్యాలలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో ఆసక్తి కలిగిన జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల నుంచి వివిధ స్థాయిల్లోని పార్టీ పదవులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి అర్హులైన నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించే ప్రక్రియలో భాగంగానే ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు హాజరై వివిధ పదవులకు దరఖాస్తులు సమర్పించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







