కతార్ పర్యాటక రంగ అభివృద్ధికి ట్రాన్సిట్ మరియు స్టాప్ ఓవర్ పధకాలు
- September 17, 2015
ట్రాన్సిట్ మరియు స్టాప్ ఓవర్ పధకాల వల్ల , కింగ్ హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా కతార్ పర్యటనకు వచ్చేవారి సంఖ్య మరింత మెరుగవుతూ వస్తోందని, కతార్ టూరిజం ఆధారిటీ (QTA)చీఫ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫీసర్ రషీద్-అల్-ఖురేష్ తెలిపారు. QTA మరియు కతార్ ఏర్ వేస్ గత రెండు సంవత్సరాల నుండి 'దోహా సిటీ టూర్ ' ద్వారా 3 గంటలలో ఉచితంగా దోహా నగర పర్యటన చేయడానికి 5 లేదా 6 గంటలు మాత్రమే ఉండగలిగే ప్రయాణీకులకు, అవకాశం కల్పించే పై రెండు పధకాల అమలుపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
HIA కు సమీపంలోని హోటళ్ళలో 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు వసతిని బుక్ చేసుకున్న ట్రాన్సిట్ ప్రయాణీకులు - దోహా లోని సౌక్ వకిఫ్, కొర్నీచే, మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్, కతారా కల్చరల్ విలెజ్ వంటి సందర్శనా ప్రదేశాలను దర్శించవచ్చని, అందువల్ల తాము వేలాది పర్యాటకులను, ప్రయాణీకులను పొందుతున్నామని, అందుకై అయ్యే స్వల్ప వ్యయాన్ని QA వారితో కలసి భరిస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న నెలల్లో వీరి సంఖ్య మరింత పెరగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతo 2.8 మిలియన్ల పర్యాటకులను ఆకర్శిoచిన నేపధ్యంలో , ఈ సంవత్సర లక్ష్యమైన 3 మిలియన్లను అధిగమించడం నల్లేరు మీద నడకని చెపుతూ, ఐతే కతార్ విలాస పర్యాటక స్థలంగా గుర్తించబదాలంటే HIA, మ్యూజియం లు, దోహా మెట్రో వంటి ఉత్తమ మౌలికసదుపాయల కల్పన చాలా అవసరమని అధికారులు పునరుద్ఘాటించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







