సిత్ర ద్వీపం లో తీవ్రవాద పేలుడు... వివాహిత జంటకు గాయాలు

- February 15, 2017 , by Maagulf
సిత్ర  ద్వీపం లో తీవ్రవాద పేలుడు... వివాహిత జంటకు గాయాలు

 

బహ్రెయిన్: కారులో షికారుకు సరదాగా వచ్చిన ఆ జంట..తమ వాహనం వద్ద అకస్మాత్తుగా తీవ్రవాదులు బాంబు పేల్చి స్వాగతించడంతో జడుసుకొన్నారు...రొమాంటిక్ మూడ్ కాస్తా వైలెంట్ సీన్ లోనికి మారిపోయింది.మనామా సమీపంలో సిత్ర  ద్వీపంలో బుధవారం తీవ్రవాదులు జరిపిన ఒక పేలుడులో వివాహిత జంటకు తీవ్ర గాయాలయ్యాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తన అధికారిక ట్విట్టర్ లో తెలిపింది. ఈ జంట బహ్రెయిన్ సిత్ర ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక బాంబు పేలుడులో వారు గాయపడ్డారు.బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో ఒక తీవ్రవాద పేలుడు ఒక 'సంఘటనను వర్ణించారు సిత్ర లో జరిగిన తీవ్రవాద పేలుడు స్వల్పస్థాయిలో ఉండటంతో వివాహిత జంట పెద్దగా గాయపడలేదని పేలుడు జరిగే సమయానికి ఆ స్థలం మీదుగా వారి కారు  ప్రయాణిస్తున్న సమయంలో బాంబు పేలడంతో వారు అనూహ్యంగా  గాయపడ్డారు.సన్నివేశం వద్దకు పోలీసులు చేరుకున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ ట్వీట్లో పేర్కొన్నారు. బహ్రేయినీ రాజధాని మనామా 5 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన సిత్ర  ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com