సిత్ర ద్వీపం లో తీవ్రవాద పేలుడు... వివాహిత జంటకు గాయాలు
- February 15, 2017
బహ్రెయిన్: కారులో షికారుకు సరదాగా వచ్చిన ఆ జంట..తమ వాహనం వద్ద అకస్మాత్తుగా తీవ్రవాదులు బాంబు పేల్చి స్వాగతించడంతో జడుసుకొన్నారు...రొమాంటిక్ మూడ్ కాస్తా వైలెంట్ సీన్ లోనికి మారిపోయింది.మనామా సమీపంలో సిత్ర ద్వీపంలో బుధవారం తీవ్రవాదులు జరిపిన ఒక పేలుడులో వివాహిత జంటకు తీవ్ర గాయాలయ్యాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తన అధికారిక ట్విట్టర్ లో తెలిపింది. ఈ జంట బహ్రెయిన్ సిత్ర ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక బాంబు పేలుడులో వారు గాయపడ్డారు.బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో ఒక తీవ్రవాద పేలుడు ఒక 'సంఘటనను వర్ణించారు సిత్ర లో జరిగిన తీవ్రవాద పేలుడు స్వల్పస్థాయిలో ఉండటంతో వివాహిత జంట పెద్దగా గాయపడలేదని పేలుడు జరిగే సమయానికి ఆ స్థలం మీదుగా వారి కారు ప్రయాణిస్తున్న సమయంలో బాంబు పేలడంతో వారు అనూహ్యంగా గాయపడ్డారు.సన్నివేశం వద్దకు పోలీసులు చేరుకున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ ట్వీట్లో పేర్కొన్నారు. బహ్రేయినీ రాజధాని మనామా 5 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన సిత్ర ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







