'మెట్రో' గ్రాండ్ సక్సెస్ కావాలి : శర్వానంద్...
- February 15, 2017
ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ప్రేమిస్తే', 'జర్నీ', 'పిజ్జా' వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -'మెట్రో'. రజని రామ్ నిర్మాత. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ప్రఖ్యాత గాయని గీతామాధురి ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మార్చి 3న విడుదలవుతోంది. ఇదివరకే స్టార్ డైరెక్టర్లు ఏ.ఆర్.మురుగదాస్, గౌతమ్‌మీనన్ 'మోట్రో' సినిమా అద్భుత చిత్రమని కితాబిచ్చారు. లేటెస్టుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో నవతరం హీరో శర్వానంద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ-"తమిళంలో అద్భుత విజయం సాధించిన చిత్రమిది. తెలుగు ట్రైలర్ చాలా బావుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద విజయం సాధించాలి. తెలుగు నిర్మాతలకు ఆల్ ది బెస్ట్" అన్నారు.
సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -"హైదరాబాద్, విశాఖ వంటి మెట్రో నగరాల్లో నిరంతరం చైన్ స్నాచింగ్ వార్తల గురించి వింటూనే ఉన్నాం. మెట్రో సిట్సిలో స్నాచర్లు మహిళల మెడలోంచి గొలుసులు తెంచుకుపోవడం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్న ఘటనల్ని వింటున్నాం. యథార్థఘటనల్ని అంతే హృద్యంగా తెరపై ఆవిష్కరించారు దర్శకులు. ఈ చిత్రాన్ని ఆర్4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజనీ రామ్ నిర్మిస్తున్నారు. మార్చి 3న సినిమా రిలీజవుతోంది. పెద్ద విజయం సాధిస్తామన్న ధీమా ఉంది. ఏ.ఆర్.మురుగదాస్, గౌతమ్‌మీనన్ వంటి ప్రముఖ దర్శకుల ప్రశంసలు పొందిన చిత్రమిది. తాజాగా టాలీవుడ్ స్టార్ శర్వానంద్ స్వయంగా థియేట్రికల్ ట్రైలర్‌ని ఆవిష్కరించి ప్రశంసించారు. శర్వాకి ధన్యవాదాలు" అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







