మాదాపూర్‌లో సునీత దారుణహత్య
- February 15, 2017
నగరంలోని మాదాపూర్ ఠాణా పరిధిలో ఓ యువతి దారుణహత్యకు గురైంది. భాగ్యనగర్ కో-ఆపరేటివ్ సొసైటీ సమీపంలో ఎన్ఐఏ భవనం పక్కన బుధవారం కాలిపోయిన స్థితిలో మృతదేహం పడి ఉంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలిని సికింద్రాబాద్‌కు చెందిన సునీతగా గుర్తించారు. ఆమె అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు సంస్థలో టెలీకాలర్‌గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన సునీత సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీతను తెలిసిన వారే హత్య చేసి ఇక్కడ పడేశారా?
అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







