మాదాపూర్‌లో సునీత దారుణహత్య

- February 15, 2017 , by Maagulf
మాదాపూర్‌లో సునీత దారుణహత్య

నగరంలోని మాదాపూర్‌ ఠాణా పరిధిలో ఓ యువతి దారుణహత్యకు గురైంది. భాగ్యనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ సమీపంలో ఎన్‌ఐఏ భవనం పక్కన బుధవారం కాలిపోయిన స్థితిలో మృతదేహం పడి ఉంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలిని సికింద్రాబాద్‌కు చెందిన సునీతగా గుర్తించారు. ఆమె అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు సంస్థలో టెలీకాలర్‌గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన సునీత సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీతను తెలిసిన వారే హత్య చేసి ఇక్కడ పడేశారా?
అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com