అభిమానులకు శుభవార్త చెప్పిన స్టైలిష్ స్టార్...
- February 15, 2017
సరైనోడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు బన్నీ. ఈ సినిమా రిలీజై దాదాపు సంవత్సరం పైగా కావొస్తుంది. సరైనోడు వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ చేయబోయే సినిమా 'డీజే.. దువ్వాడ జగన్నాథమ్'. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్దే నటిస్తోండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్తను బన్నీ తన అభిమానులతో పంచుకున్నాడు. అదేమిటంటే.. 'డీజే.. దువ్వాడ జగన్నాథమ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ నెల 18న విడుదల చేయబోతున్నట్లు అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ప్రతి సినిమాకు గెటప్‌లో వేరియేషన్ చూపించే బన్నీ.. ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఈ సినిమా గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని, అందులో ఒకటి బ్రాహ్మణుడి పాత్ర కాగా, మరో పాత్ర స్టైలిష్‌గా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి.
అయితే వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఈ నెల 18 వరకూ ఆగల్సిందే. ఈ సినిమా టీజర్‌ను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







