మెగా ఫోన్ పట్టుకున్న బుల్లితెర మెగా స్టార్..
- February 16, 2017
ఒకప్పుడు బుల్లితెర మెగా స్టార్ గా పిలువబడే ప్రభాకర్..ఈటీవీ లో వచ్చే ప్రతి సీరియల్లో కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈటీవీ నుండి బయటకు వచ్చిన ప్రభాకర్ , కొంతకాలం బుల్లితెర కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ మధ్యనే మళ్లీ సిరియాల్లోకి ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్నాడు.
తాజాగా ఈ బుల్లి మెగా స్టార్ మెగా ఫోన్ పట్టుకున్నడని సమాచారం.
కొంతకాలంగా డైరెక్టర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న ప్రభాకర్ , అల్లు శిరీష్ తో ఓ సినిమా చేయాలనీ కథను రెడీ చేసి , అతడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. కాకపోతే ప్రస్తుతం శిరీష్ బిజీ గా ఉండడం తో డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం తో , ప్రభాకర్ అదే కథ ను సాయి కుమార్ తనయుడు ఆది కి చెప్పి ఒకే చేయించాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా మొదలు పెట్టాడని తెలుస్తుంది. మార్చ్ నెలాఖర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రభాస్ తన హోం బ్యానర్ అని గర్వంగా చెప్పే యూవీ క్రియేషన్స్ పై.. వంశీ.. ప్రమోద్ లు నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుండడం విశేషం. రొమాంటిక్ జోనర్ లో ఉండే ఈ మూవీ తో ప్రభాకర్ డైరెక్టర్ గా సక్సెస్ అవుతాడని అంటున్నారు.
చూద్దాం బుల్లితెర ఫై అలరించిన ప్రభాకర్ , వెండి తెర ఫై ఎలాంటి మార్కులు వేసుకుంటాడో.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







