తమిళనాడు సీఎం గా పళనిస్వామి..
- February 16, 2017
10 రోజులుగా తమిళనాట ఏర్పడిన రాజకీయాలకు తెరపడింది. తమిళనాడు సీఎం ఎవరు అవుతారా అని ఎంతో ఆతృతగాఎదురుచూసిన తమిళ నాడు ప్రజలకు ఎట్టకేలకు పళనిస్వామి ని సీఎం గా గవర్నర్ విద్యాసాగర్ నియమించారు. బలనిరూపణ కోసం 15 రోజులు గడవు ఇచ్చినట్లు తెలుస్తుంది. కొద్దీ సేపటి క్రితం విద్యాసాగర్ తో పళనిస్వామి భేటీ అయ్యారు. భేటీ అనంతరం పళనిస్వామి ని ప్రభుత్వం ఏర్పటుకు గవర్నర్ ఆహ్వానం ఇచ్చారు. ఈరోజు సాయింత్రం 4 : 30 నిమిషాలకు పళనిస్వామి ని సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
రెండు రోజుల క్రితం వరకు తమిళ పీఠం కోసం చినమ్మ , పన్నీరు నువ్వా నేనా అనేంతలా కొట్టుకున్నారు.
కానీ అక్రమ ఆస్తుల కేసులో సుప్రీం కోర్ట్ శశికళ ను దోషిగా తేల్చడం తో ఇక పన్నీరు నే తమిళ సీఎం అవుతాడని ఆయన వర్గాలు సంబరాలు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ బరిలోకి అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి ఎంట్రీ ఇచ్చాడు.
తనకు ప్రభుత్వాన్ని ఏర్పటు చేసే ఎమ్మెల్యేల సంఖ్యా మద్దతు ఉందని గవర్నర్ విద్యాసాగర్ కు చెప్పడం తో , గవర్నర్ సైతం పళనిస్వామి వైపే ముగ్గు చూపించడం జరిగిపోయింది. మొత్తానికి తమిళ రాజకీయాలకు తెర పడడం తో అందరూ శాంతించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







