భారత్‌లో మరో దేశీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభం...
- February 16, 2017
న్యూఢిల్లీ: భారత్‌లో మరో దేశీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జూమ్ ఎయిర్ అనే సంస్థ బుధవారం నుంచి ప్రాంతీయ సర్వీసులు ప్రారంభించింది. న్యూఢిల్లీ నుంచి దుర్గాపూర్ మీదుగా కోల్‌కతాకు తొలి విమానాన్ని నడిపింది. దీంతో జూమ్ ఎయిర్ 12వ దేశీయ విమానయాన సంస్థగా ఆవిర్భవించినట్లయ్యింది. షెడ్యూల్ ప్రకారం విమానాలు నడిపేందుకు డీజీసీఏ నుంచి ఫిబ్రవరి 3న ఈ సంస్థ అనుమతి పొందింది.
జిక్స్అజ్ ఎయిర్ సర్వీస్ ప్రొమోట్ చేస్తున్న జూమ్ ఎయిర్‌లైన్స్‌కు ప్రస్తుతం మూడు విమానాలున్నాయి. న్యూఢిల్లీ నుంచి అమృత్ సర్, సూరత్, భావనగర్‌కు సర్వీసులు నడపనుంది. త్వరలో విజయవాడ, తిరుపతి, రాంచీ, చంఢీగడ్‌కు విమాన సర్వీసులు విస్తరించనున్నట్లు జూమ్ ఎయిర్ ఎండీ, సీఈవో కౌస్తవ్ మోహన్ ధర్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







