అమెజాన్ కొత్తప్రయోగం..!!
- February 16, 2017
సరకులను హోం డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సరికొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే డ్రోన్లతో డెలివరీ సేవలను ప్రారంభించిన ఆసంస్థ.. ఇక పై గగనతలం నుంచి కస్టమర్ల ఇంటి గుమ్మం ముందు పార్శిళ్లను దించేందుకు పారాచూట్ లను వినియోగించనుందట.
ప్రస్తుతం అమెజాన్ ప్రారంభించిన డ్రోన్ డెలివరీ విధానంలో వినియోగదారుడి ఇంటి వద్ద డ్రోన్ లాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే డ్రోన్లు గగనతలంలో ప్రయాణించడం కంటే లాండింగ్.. టేకాఫ్ లకే ఎక్కువ ఇంధనం ఖర్చవుతందట. దాంతో పాటు కొన్ని భద్రతా పరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. అందుకే డ్రోన్లతో రవాణా చేసి గగనతలం నుంచే సరుకులను భద్రంగా కిందికి దించేందుకు పారాచూట్ లను వినియోగించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
అయితే.. కిందికి వదిలాక గాలి ప్రవాహంతో పారాచూట్ లు అటుఇటు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆసమస్యకూ పరిష్కారం కనుగొన్నట్లు అమెజాన్ తెలిపింది. పారాచూట్ కిందికి దిగేంత వరకు డ్రోన్ అక్కడే గాలిలో ఉండి గమనిస్తుందట. ఒకవేళ పారాచూట్ పక్కకు కదిలితే ప్రత్యేకంగా సగ్నళ్లతో దాన్ని సరైన చోటే దిగేలా చేస్తుదట. అందుకు పారాచూట్లలోనూ ప్రత్యేకమైన వ్యవస్థ రూపొందించారాట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







