భారత్‌లో మరో దేశీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభం...

- February 16, 2017 , by Maagulf
భారత్‌లో మరో దేశీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభం...

న్యూఢిల్లీ: భారత్‌లో మరో దేశీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జూమ్ ఎయిర్ అనే సంస్థ బుధవారం నుంచి ప్రాంతీయ సర్వీసులు ప్రారంభించింది. న్యూఢిల్లీ నుంచి దుర్గాపూర్ మీదుగా కోల్‌కతాకు తొలి విమానాన్ని నడిపింది. దీంతో జూమ్ ఎయిర్ 12వ దేశీయ విమానయాన సంస్థగా ఆవిర్భవించినట్లయ్యింది. షెడ్యూల్ ప్రకారం విమానాలు నడిపేందుకు డీజీసీఏ నుంచి ఫిబ్రవరి 3న ఈ సంస్థ అనుమతి పొందింది.
జిక్స్అజ్ ఎయిర్ సర్వీస్ ప్రొమోట్ చేస్తున్న జూమ్ ఎయిర్‌లైన్స్‌కు ప్రస్తుతం మూడు విమానాలున్నాయి. న్యూఢిల్లీ నుంచి అమృత్ సర్, సూరత్, భావనగర్‌కు సర్వీసులు నడపనుంది. త్వరలో విజయవాడ, తిరుపతి, రాంచీ, చంఢీగడ్‌కు విమాన సర్వీసులు విస్తరించనున్నట్లు జూమ్ ఎయిర్ ఎండీ, సీఈవో కౌస్తవ్ మోహన్ ధర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com