ఒకేరోజు 24 మంది ఉగ్రవాదులు హతం..
- February 17, 2017
ఇస్లామాబాద్: ఓ ప్రార్థనాలయంలో ఉగ్రవాది చొరబడి ఆత్మాహుతితో 76 మందిని బలితీసుకున్న తెల్లారే.. పాకిస్తాన్ భద్రతా దళాలు శుక్రవారం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాయి. మొత్తం 24 మంది మిలిటెంట్లను కాల్చి చంపాయి. ఒక్క దక్షణ ప్రావిన్సులోనే 18 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పారామిలటరీ సింద్ రేంజర్స్ శుక్రవారం వెల్లడించింది. సింధ్‌లోని సూపర్ హైవే వద్ద సైనిక కాన్వాయ్‌పై కాల్పులకు తెగబడిన మరో ఏడుగురు ఉగ్రవాదులు కూడా హతమైనట్టు రేంజర్స్ పేర్కొంది. కరాచీలో మంఘోపిర్ వద్ద జరిపిన సోదాల్లో 11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్టు తెలిపింది. మరోవైపు ఖైబర్-పక్తున్ఖవాలో పోలీసులు ప్రత్యేకంగా జరిపిన ఆపరేషన్‌లో మరో 11 మంది తీవ్రవాదులు హతమయ్యారు.
రెగ్గీ ప్రాంతంలో ముగ్గురు, పెషావర్‌లో నలుగురు, బన్ను ప్రాంతంలో మరో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని ఓ సీనియర్ భద్రతాధికారి వెల్లడించారు. తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోందనీ... ముందు ముందు మరిన్ని విస్తృత దాడులు చేస్తామని ప్రకటించారు. కేవలం వారం రోజుల్లోపు ఎనిమిది సార్లకు పైగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సోదాలకు ఆదేశించినట్టు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







