పైత్యం ప్రకోపించిన పాకిస్థాన్ కార్మికుడు 8 ఏళ్ల బాలిక పెదవులను ముద్దాడేడు !!
- February 17, 2017
దుబాయ్ : మనసులోని వికారాలను కొందరు తమ చేష్టల ద్వారా బహిర్గతం చేస్తారు. అటువంటి పైత్యం ప్రకోపించిన ఓ పాకిస్తాన్ యువకుడు ప్రస్తుతం కోర్టు అభియోగాలలో చిక్కుకున్నాడు. తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆటలు ఆడుకొంటున్న 8 ఏళ్ల బాలికని లక్ష్యంగా చేసుకొన్నాడు. సమీపంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆ చిన్నారి పెదవులను చుంబించాడు ఇంటి సామానులు తరలించే సంస్థలో కార్మికునిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి ఒక గదిలో ఒంటరిగా కూర్చొని అమాయకంగా ఆటలాడుకొంటున్న ఒక 8 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించాడని ఇటీవల ఒక అభియోగం అతనిపై నమోదైంది. దీనిపై గురువారం నాడు విచారణ జరిగింది. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తెలిపిన సమాచారం మేరకు నిందితుడు బాలిక ఒంటరిగా ఒక బెడ్ రూమ్ లో ఆటలాడుకొంటున్న సమయంలో సామాను సర్ది అక్కడ్నించి తరలించే పని చేయాల్సిందిపోయి 23 ఏళ్ల పాకిస్తానీ ముద్దాయి అభం శుభం తెలియని ఆ చిట్టి తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించేందుకు ఆ సమయాన్ని మలుచుకొన్నాడు. దీనితో భయపడిన ఆ బాలిక అక్కడ్నించి పరుగెత్తుకు వెళ్లి తల్లి వద్దకు చేరుకోందని నేరారోపణ చేసింది. దీనితో పాకిస్థాన్ ముద్దాయి తరుపున వాదించే రక్షణ న్యాయవాది తదుపరి విచారణ వరకు కేసు ఫైల్ యొక్క నకలును ఇవ్వాలని అభ్యర్థించిన నేపథ్యంలో ఆ కాపీని ఆయనకు అందించారు. కాగా నిందితుడు తాను ఆ బాలిక పట్ల చేసిన తప్పునకు ఏ మాత్రం పశ్చాత్తాపపడకపోవడం గమనార్హం.దీనితో ఆ కార్మికుడిని తదుపరి విచారణ వరకు నిర్బంధంలో ఉంచబడ్డాడు. 36 ఏళ్ల ఆ బాలిక తల్లి ఒక ఆస్ట్రియన్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.ఆమె ఇంట్లో ఫర్నిచర్ తరలించడానికి వచ్చిన సంస్థ సిబ్బందికి తరలింపు పని అప్పగించడంతో ఆమె ఆ పనులలో నిమగ్నమై ఉండగా ఆ సంఘటన జరిగినట్లు ఆమె తెలిపింది. ఈ కేసు మార్చి13 వ తేదికి వాయిదా వేయబడింది. గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీన ఆల్ బార్ష పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు నమోదు చేయబడింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







