దుబాయ్ లో 306 మీటర్ల టవర్ పై రష్యన్ మోడల్ సాహసకృత్యాలు
- February 17, 2017
దుబాయ్ : మొబైల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఫోటోలు దిగి ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన నెటిజన్లు.. సెల్ఫీ వచ్చాక.. వారికి హద్దే లేకుండా పోయింది. వెరైటీగా అనిపిస్తే చాలు.. సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో పెట్టేయడం.. ఫ్యాషనైపోయింది. ఎవరూ వెళ్లలేని, చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లి మరీ సెల్ఫీలు దిగుతూ.. గ్రేట్ అనిపించుకుంటున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ మోడల్.. 23 ఏళ్ల రష్యన్ మోడల్ విక్టోరియా ఒడింట్‌కోవా కూడా గత నెలలో ఓ సెల్ఫీ వీడియోను, దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒళ్లు గగుర్బొడిచే ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయి ఒకటైనా లాడ్జి కాయిన్ టవర్ నుండి డాంగ్లింగ్ స్కైక్రాపర్‌ను ఎక్కి ఆమె చేసిన సాహసాన్ని వీక్షించి అందరు ముక్కున వేలేసుకుని, గుండె పట్టుకుని మరీ నెటిజన్లు వీక్షిస్తున్నారు. 306 మీటర్ల ( 1004 ) అడుగుల ఎత్తైన ఆ టవర్‌పై తన సహాయకుడి చేతిని పట్టుకుని గాల్లోకి ఒక్కసారిగా జర్రున జారిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఔరా అని ఆశ్చర్యపోతున్నారు.


తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







