ముంగోడీ కర్రీ..
- February 17, 2017
కావలసిన పదార్థాలు
కందిపప్పు- ఒక కప్పు, మినప్పప్పు- అర కప్పు, ఇంగువ- చిటికెడు, తరిగిన ఉల్లిపాయ, టమోట- ఒక్కోటి చొప్పున, పచ్చిమిర్చి- 3, అల్లం తురుము- ఒక టీస్పూను, జీలకర్ర- అర టీ స్పూను, ధనియాల పొడి- ఒక టీస్పూను, పసుపు- పావు టీ స్పూను, కారం- ఒక టేబుల్ స్పూను, ఉప్పు- తగినంత, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం
కందిపప్పు, మినప్పప్పులను ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకో వాలి. తర్వాత ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూను అల్లం తురుము వేసి పుణుగుల్లా నూనెలో వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో 2 టీస్పూన్ల నూనె పోసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మిగిలిన అల్లం తురుము వేసి వేగించాలి. తర్వాత టమోటా, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించి 2 గ్లాసుల నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. చివర్లో పుణుగులను వేసి మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







