హెలికాప్టర్ కెమెరాలు సైబరాబాద్లో...
- February 17, 2017
కొనుగోలుకు పోలీసుల కసరత్తు
పలు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు సైబరాబాద్ పోలీసుల అమ్ముల పొదిలో హెలికాప్టర్ కెమెరాలు చేరబోతున్నాయి. సైబర్ సిటీ భద్రత దృష్ట్యా ఈ కెమెరాలను కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. హెలికాప్టర్ కెమెరాల ద్వారా ఐటీ కారిడార్పై డేగకన్ను వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. హెలికాప్టర్ కెమెరాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో గచ్చిబౌలి కమిషనరేట్లో శుక్రవారం సంప్ర దింపులు జరిపారు. వాటి పనితీరు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం తదితర విషయాలు చర్చకు వచ్చినట్టు విశ్వస నీయంగా తెలిసింది.
కంపెనీల ప్రతినిధులు వాటి పనితీరుపై డెమో కూడా ఇచ్చారు. అత్యాధునిక కెమెరాల గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం.
ధర 75 లక్షలు
అత్యాధునిక హెలికాప్టర్ కెమెరాల ధర భారీగా ఉన్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఒక్కోదానికి రూ. 75 లక్షల మేర ఖర్చవుతోందని కంపెనీల ప్రతినిధులు సమావేశంలో పేర్కొ న్నారు. బడ్జెట్ను బట్టి వాటిని త్వరలో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలిసింది. ట్రాఫిక్ రద్దీ, నేరగాళ్ల కదలికలను హెలికాప్టర్ కెమెరాల ద్వారా సులువుగా పసిగట్టవచ్చని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







