ఉత్కంఠ నడుమ తమిళనాడు అసెంబ్లీ బలపరీక్షకు..
- February 17, 2017
ఉత్కంఠ నడుమ తమిళనాడు అసెంబ్లీ బలపరీక్షకు సిద్ధమైంది. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్ సెల్వం తమ తమ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి చేరుకున్నారు. పళని స్వామి వర్గం కొద్ది సేపటి కిందటే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అసెంబ్లీ చేరుకుంది. పళనిస్వామికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, పన్నీర్ సెల్వంకు 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. పళనిస్వామి వర్గానికి చెందిన అరుణ్ కుమార్ తాను ఓటింగ్‌లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పేశారు.
ఇప్పటికే బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే నిర్ణయించింది. అనారోగ్యం వల్ల ఆ పార్టీకి చెందిన కరుణానిధి అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఓటింగ్‌ను రహస్య బ్యాలెట్ విధానంలో చేపట్టాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్నా.. అది జరిగే అవకాశం కనిపించడంలేదు. అసెంబ్లీలో బలపరీక్ష కోసం సభా నాయకుడిగా సెంగొట్టయ్యన్‌ను నియమించారు. అసెంబ్లీలో 6 డివిజన్లు ఉండగా.. అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. 6 డివిజన్ల ప్రక్రియ అనంతరం నిర్ణయం స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. బలపరీక్ష నేపథ్యంలో చెన్నై అసెంబ్లీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







