ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందే: డొనాల్డ్ ట్రంప్
- February 18, 2017
ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందేనని, ఉగ్రవాదులను ఓడించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను తమ ప్రభుత్వం సాధించగలదన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు. 'ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరికీ ముప్పే. కనుక దీనిని ప్రతిఘటించి ఉగ్రవాదులను ఓడించి తీరాలి' అని శుక్రవారం ఆయన అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన వారాంతపు రేడియో ప్రసంగంలో పేర్కొన్నారు. గత వారం ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యానని, ఇజ్రాయిల్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయనకు భరోసా ఇచ్చానని ట్రంప్ తెలిపారు. మిత్రదేశాల భద్రతకు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ట్రంప్ చెప్పారు. ఇదిలావుంటే, ఉత్తర అమెరికా సైనిక కూటమి (నాటో)కి ట్రంప్ అండగా నిలుస్తారని, ఈ విషయంలో ఆయన నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







