ఆఫర్లతో ఆకట్టుకుంటున్న బీఎస్ఎన్ఎల్
- February 19, 2017
హైదరాబాద్ పరిధిలో 9 లక్షల కనెక్షన్లు కలిగిన ప్రభుత్వం రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ భలేభలే ఆఫర్లు ప్రకటించింది. ప్రైవేటు ఆపరేటర్లకు దీటుగా వినియోగదారులను ఆకర్షించేందుకు తాజా వివిధ రకాల ఆఫర్లుతో ముందుకొచ్చింది. ఇవే ఆ ప్లాన్లు.. 'ఆల్ ఫ్రీ ప్లాన్' పేరుతో రూ.144 వోచర్‌తో 30 రోజుల కాలపరిమితితో అన్ని నెటవర్క్‌లకు రోజుకు అరగంటపాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అదే రూ.439 వోచర్‌తో 90 రోజుల వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.339తో 28 రోజుల కాల పరిమితితో స్పెషల్ టారిఫ్ వోచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద అన్ని నెట్‌వర్క్‌లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.
అంతేకాక 1 జీబీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. అదే రూ.139 వోచర్‌పై అయితే 300 ఎంబీ ఉచిత డేటాతోపాటు సేమ్ నెట్‌వర్క్‌కు అపరమిత కాల్స్ చేసుకోవచ్చు. మార్చి 17 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే వివిధ రీచార్జ్ వోచర్లపై అదనపు టాక్‌టైం అందిస్తోంది.
వీటితోపాటు రూ. 4498, రూ. 3998, రూ.2798, రూ.1498 వోచర్లపై డబుల్ డేటా అందిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ఆఫర్ కూడా మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
అలాగే కాంబో ఆఫర్లు, కొత్త కనెక్షన్లు తీసుకున్న వారి కోసం కూడా బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్లు ప్రకటించింది. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







