గ్రీన్ కార్డు హోల్డర్స్ భయపడక్కర్లేదు
- February 20, 2017
ఏడు ముస్లిం దేశాలను టార్గెట్ గా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలతో కొంత వెనక్కి తగ్గిన ట్రంప్ మళ్లీ ఇమ్మిగ్రేషన్ పై కొత్త కార్యనిర్వాహక ఆదేశాలను జారీచేస్తానని చెప్పారు. కానీ ట్రంప్ తీసుకురాబోతున్న పునఃసమీక్షించిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లోనూ మళ్లీ ఆ ఏడు దేశాలనే టార్గెట్ చేశారట. మళ్లీ ఆ ఏడు ముస్లిం దేశాలనే టార్గెట్ చేసిన ట్రంప్ గ్రీన్ కార్డు హోల్డర్స్ ను ఆ నిషేధం నుంచి మినహాయించారని తెలుస్తోంది. ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారిని అమెరికాలోకి ప్రయాణించడానికి అనుమతిస్తారని అధికారులు పేర్కొంటున్నారు..
ఒరిజనల్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ మాదిరిగానే ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్, సోమాలియా, సూడాన్, లిబియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అమెరికాలోకి అనుమతించరని, పునఃసమీక్షించిన ఆర్డర్లోనూ ఈ దేశాలపై నిషేధం కొనసాగుతుందని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సారి గ్రీన్ కార్డు హోల్డర్స్ ను, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారిని ఈ నిషేధం నుంచి మినహాయిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం డ్రాఫ్ట్ రూపంలో అధికారులందరికీ సర్క్యూలేట్ అయిందని, ఫైనల్ వెర్షన్ త్వరలోనే విడుదల చేస్తామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా హకబీ సాండర్స్ చెప్పారు. దీనిపై హోమ్ లాండ్ సెక్యురిటీ డిపార్ట్ మెంట్ వెంటనే స్పందించలేదు. సమీక్షించిన డ్రాఫ్ట్ మళ్లీ ఆ ఏడు దేశాలనే టార్గెట్ చేస్తుందని, కానీ ఈ నిషేధం నుంచి గ్రీన్ కార్డు హోల్డర్స్ ను మినహాయిస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా రిపోర్టు చేసింది.
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







