అర్జెంటీనాలో బస్సు ప్రమాదం
- February 20, 2017
అర్జెంటీ నాలో బస్సు ప్రమాదం చోటుచేసుకు న్నది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణా లతో బయటపడ్డాడు. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం చిలీ సరిహద్దులోని అర్జెంటీనా ఆండీస్ ప్రాంతంలో ఓ ప్రయివేట్ బస్సు బోల్తా పడింది. దీంతో, బస్సులోని 19 మంది ప్రయాణికులు మృతి చెం దారు. ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మెన్‌దోజా ప్రావిన్స్ గవర్నర్ అలెజాంద్రో గుల్లె మృతుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి దారి తీసిన వివరాలను క్షతగాత్రుడి నుంచి సేకరించినట్టు చెప్పారు. బస్సు డ్రైవర్ ఘాట్ రోడ్డులో వాహనాన్ని అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నామని అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా







