2.6 మిలియన్ దిర్హామ్‌ల దోపిడీ కేసులో గ్యాంగ్ అరెస్ట్
- February 20, 2017
దుబాయ్ పోలీసులు, యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ఒమన్ అథారిటీస్‌తో కలిసి 10 మంది ఆఫ్రికన్ల గ్యాంగ్‌ని అరెస్ట్ చేయగలిగారు. ఫిబ్రవరి 15, ఓ మనీ ఎక్స్‌ఛేంజ్‌పై దాడి చేసిన దుండగులు 3.6 మిలియన్ దిర్హామ్‌లు దొంగిలించారు. కేవలం 46 గంటల్లోనే ఈ గ్యాంగ్‌ని పోలీసులు పట్టుకోగలిగారు. దుబాయ్ పోలీస్ అండ్ జనరల్ సెక్యూరిటీ డిప్యూటీ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖల్ఫాన్ తమీమ్ ఈ ఘటనలో నిందితుల్ని పట్టుకున్నందుకు పోలీసుల్ని అభినందించారు. దోపిడీకి పథకం వేసిన ఆఫ్రికన్ ముఠా, ముందుగా అరబ్ బ్రోకర్‌ని సంప్రదించి తమ వద్ద డాలర్లున్నాయనీ వాటిని మార్చాల్సి ఉందని తెలపగా, మనీ ఎక్స్‌ఛేంజ్ అధికారులు ముగ్గుర్ను తీసుకుని హోటల్‌లో సమావేశమయ్యాడు ఆ బ్రోకర్. ఈ సమయంలోనే ఆయుధాలతో బెదిరించిన ముఠా సభ్యులు, అక్కడినుంచి ఆ సొమ్ముతో పారిపోయారు. బాధితుల్ని గుర్తించిన రూమ్ క్లీనర్ పోలీసులకు సమాచారమివ్వడంతో సకాలంలో పోలీసులు స్పందించారు. ఈ గ్యాంగ్‌లో ముగ్గురు ఒమన్ పారిపోగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ద్వారా ఒమనీ అధికారుల్ని సంప్రదించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







