2017లో 5000కు పైగా ఉద్యోగాలు కల్పించడం బ్రిటన్ లో అమెజాన్
- February 20, 2017
లండన్ : ప్రముఖ బహుళ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది బ్రిటన్ లో 5వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించనుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియకు సన్నద్ధమవుతున్న సమయంలోనే ఆ దేశంలో తమ పెట్టుబడులను పెంచనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అమెజాన్ తో పాటు ఇతర టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్ లు కూడా బ్రిటన్ లో తమ కమిట్ మెంట్ ను పెంచుకుంటామని ప్రకటించాయి.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే నిర్ణయం తమ పెట్టుబడుల ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొన్నాయి. 2017లో 5000కు పైగా ఉద్యోగాలు కల్పించడం బ్రిటన్ లో అమెజాన్ రికార్డు సృష్టించడమేనని తెలుస్తోంది. ఈ ప్లాన్స్ తో కంపెనీ శాశ్వత ఉద్యోగుల సంఖ్య ఆ దేశంలో 24వేలకు పెరుగనుంది.
బ్రిటన్ లో ఉద్యోగాలు కల్పించడంతో కస్టమర్లకు వెనువెంటనే డెలివరీ, మంచి విలువలను కల్పిస్తామని అమెజాన్ యూకే మేనేజర్ డౌ గుర్ చెప్పారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!







