దుబాయ్‌లో మరో అద్భుత కట్టడం..
- February 20, 2017
దుబాయ్ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం. అయితే బూర్జ్ అంత ఎత్తు కాకపోయినా దాన్ని మరిపించేలా మరో భవంతిని దుబాయ్‌లో నిర్మిస్తున్నారు. దీంట్లో ఏముందిలే అని తీసిపారేయకండి. అది నిజంగా ఓ అద్భుతమే. ఎందుకంటే ఆ భవంతిలో ఉన్న ప్లాట్లను ఇష్టానుసారంగా తిప్పేయొచ్చు. అవునండి అదేలా అనుకుంటున్నారా ?
ఎత్తైన భవనంలో హాయిగా వరండాలో కూర్చొని సూర్యోదయం ఎవరైనా చూసే ఉంటారు. కానీ అదే వరండాలో కూర్చున్న చోటు నుంచే సూర్యాస్తమయాన్ని కూడా వీక్షించేలా ఓ భారీ నిర్మాణాన్ని మనం త్వరలో చూడబోతున్నాము. దుబాయ్ లోని డైనమిక్ టవర్ హోటల్ లో ఒక్కో అంతస్తుల్లో దేనికి అవే సేపరేట్‌గా ఉన్న ప్లోర్‌లను నిర్మిస్తున్నారు.
ముందుగా మధ్యభాగంలో నిర్మించిన ఎత్తైన కాంక్రీట్ నిర్మాణానికి వేరే చోటున తయారు చేసిన యూనిట్లను అటాచ్ చేస్తూ ఈ భారీ ఆకాశహర్మ్యాన్ని రూపొందిస్తున్నారు. తన చుట్టు తాను తిరిగేలా ఉన్న ఈ ఆకాశహర్మ్యం నిజంగా నిర్మాణ రంగంలో ఓ నూతన అధ్యాయంగా చెప్పొచ్చు.
గాలి మరలు, సౌరపలకల సాయంతో ఈ భవంతికి అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం దీని మరో ప్రత్యేకత. వాయిస్ ఆక్టివేటెడ్ కమాండ్ సిస్టమ్‌తో ఆ గుదుల్లో బస చేసేవారు తమ ఇష్టానుసారంగా ఫ్లోర్లను తిప్పేయోచ్చు. ఒక్కో ఫ్లోర్లో యూనిట్ల వారిగా గదులను నిర్మించారు. 1,375 అడుగుల ఎత్తు ఉన్న ఈ భవంతిలో మొత్తం 80 ఫ్లోర్లు నిర్మిస్తున్నారు.
ఏదో ఓ హోటల్‌లో దిగామా.. అన్నట్టు కాకుండా ఇక్కడ బస చేయడానికి వచ్చిన కస్టమర్లు ఓ కొత్త అనుభూతిని పొందడం ఖాయమని ఈ భవంతిని నిర్మిస్తున్న డైనమిక్ గ్రూప్ చెబుతోంది. వీటితో పాటూ ఎలాగూ ఖరీదైన హోటల్ లలో అందించే.. మరిన్ని విలాసమంతమైన వసతి, సదుపాయాలువంటివి ఎలాగూ ఇందులో ఉండనే ఉన్నాయి. బిజినెస్ లేదా వ్యక్తిగత పర్యటనల కోసం వచ్చేవారికి భవంతి నిర్మాణంలో వాడిన కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఓ కొత్త అనుభూతిని అందిస్తుందని డైనమిక్ గ్రూప్ అంటోంది.
కొన్ని ఫ్లోర్లలోని యూనిట్లను ప్రత్యేకంగా అపార్ట్ మెంట్‌లుగా వాడుకునేలా కూడా నిర్మిస్తున్నారు. అయితే ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ భవంతిలోని ఒక్కో అపార్ట్‌మెంట్ ప్రస్తుత విలువ దాదాపు రూ.200 కోట్లుగా అంచనా. భవన నిర్మాణం పూర్తయ్యేవరకు ఈ ధర ఎంతుంటుందో వేచి చూడాల్సిందే.
ఈ డైనమిక్ టవర్ నిర్మాణానికి తొమ్మిదేళ్ల కిందటే ఇజ్రాయిలీ-ఇటాలియన్ ఆర్కిటెక్ట్ డేవిడ్ ఫిషర్ రూపకల్పన చేశారు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి మరిన్ని విషయాలను మాత్రం ఫిషర్ చెప్పడం లేదు. ఇప్పడే అన్నీ చెబితే ఎలా.. మిగతావన్నీ సర్‌ప్రైజ్ అంటూ దాటవేశారు. 2008 నుంచి ఈ భవంతి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2020 వరకు దీని నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







