సికందరీ రాన్
- February 20, 2017
కావలసిన పదార్థాలు: మటన్ జాయింట్ - 600 గ్రా, కారం - 20 గ్రా, అల్లం వెల్లుల్లి ముద్ద - తగినంత, కాశ్మీరీ కారం - 50 గ్రా
గరం మసాలా - రెండు గ్రా, ఆవ నూనె - 100 మి.లీ, పెరుగు - 300 మి.లీ, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం: కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి, ఉప్పు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్ జాయింట్‌కు పట్టించి ఫ్రిజ్‌లో కనీసం 6 గంటలు ఉంచాలి. వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో రెండు లీటర్ల నీళ్లు పోసి మిగిలిన పదార్థాలు, మటన్ జాయింట్‌ను వేయాలి. పాత్రకు సిల్వర్ ఫాయిల్ చుట్టేయాలి. 160 డిగ్రీల్లో ఓవెన్‌ను ప్రీ హీట్ చేసుకుని దాన్లో పాత్రను ఉంచాలి. ఇలా గంటంబావు ఉడికిస్తూ మధ్య మధ్యలో గమనిస్తూ ఎముక నుంచి మటన్ వేరు పడుతున్నప్పుడు ఓవెన్ నుంచి బయటకు తీయాలి. దీన్ని మళ్లీ ఇనుప చువ్వకు గుచ్చి నిప్పులపై కాల్చాలి. ఆ తర్వాత పైన సాస్‌తో అలంకరించి వడ్డించాలి.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







