"పుల్లారెడ్డి స్వీట్స్" కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్న మహేష్
- September 20, 2015
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన, అందరికి అత్యంత ప్రీతిపాత్రమైన స్వీట్స్ పుల్లారెడ్డి స్వీట్స్. ఏ మాత్రం పరిచయం అవసరం లేని పుల్లారెడ్డి స్వీట్స్ ని రుచిచూడాలని ఎవరికైనా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకులు సైతం పుల్లారెడ్డి స్వీట్స్ ప్రాముఖ్యతని తెలుసుకొని మరీ టేస్ట్ ని చూస్తారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పుల్లారెడ్డి స్వీట్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకూ లిమిటెడ్ స్టోర్లకే పరిమితమైన పుల్లారెడ్డి స్వీట్స్, ఇకనుండి దేశవ్యాప్తంగా స్టోర్స్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వారి బ్రాండ్ కి ప్రచారకర్తగా ఓ ఫిల్మ్ సెలబ్రిటీని తీసుకోవాలని ఆలోచనలు చేసింది. అందులోని భాగంగానే ప్రిన్స్ మహేష్ బాబుని వారు సెలక్ట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సంవత్సరం పాటు మహేష్ బాబు, పుల్లారెడ్డి స్వీట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. దీనికి సంబంధించిన అడ్వెర్టైజింగ్ ప్లానింగ్స్ ని ఇప్పటికే ఓ నేషనల్ అడ్వర్టైజింగ్ సంస్థకి పుల్లారెడ్డి స్వీట్స్ కంపెనీ ఇచ్చిందంటా. మొత్తంగా పుల్లారెడ్డి స్వీట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ కొనసాగటం పట్ల మహేష్ హ్యాపీగా ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







