'స్పైస్ జెట్' ఎయిర్లైన్స్ వారి గొప్ప ఆఫర్
- February 22, 2017
ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. దీంతో ఆఫర్లమీద ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఎయిర్ ఆసియా, జెట్‌ఎయిర్‌వేస్ సంస్థలు దేశీయ విమానాల్లో తక్కువ ధరలకే విమాన టికెట్లు అందిస్తామని ప్రకటించగా, తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ రోజు ‘లక్కీ 7సేల్’ పేరుతో ఓ సరికొత్త పథకాన్ని వెల్లడించింది. అన్ని ఛార్జీలను కలిపి ఒక్కో టికెట్‌ను కేవలం రూ.777లకే అందించనున్నట్టు తెలిపింది.
ఈ సరికొత్త ఆఫర్ కింద ఈ నెల 22 నుంచి నాలుగు రోజులపాటు టికెట్ల అమ్మకాలు కొనసాగిస్తారు. అయితే, ఒకవైపు ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.
ఈ ఆఫర్‌లో మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 లోపల ప్రయాణానికి మాత్రమే టికెట్లు లభిస్తాయని స్పష్టంచేసింది. టికెట్లను స్పైస్‌జెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి లేదంటే ట్రావెల్ ఏజెంట్, ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్స్‌లోనూ పొందవచ్చని స్పైస్‌జెట్ తెలిపింది. ఆఫర్ కింద పరిమిత సీట్లను కేటాయించినందువల్ల మొదట వచ్చినవారికి ప్రాధాన్యం.. ప్రాతిపదికన టికెట్లు ఇస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!







