'లంక'లో రాశి
- February 23, 2017
గత ఏడాది ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో కథానాయిక తల్లిగా కనిపించిన నటి రాశి త్వరలో ‘లంక’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాశి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. థ్రిల్లర్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచార చిత్రాన్ని చూస్తుంటే తెలుస్తోంది. శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్. దినేష్, ఎన్. విష్ణు కుమార్‌లు రోలింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







