తీవ్రవాద పేలుడు కారణంగా బహ్రెయిన్ మహిళకు గాయాలు
- February 24, 2017
గత రాత్రి జరిగిన తీవ్రవాద పేలుడు కారణంగా ఓ మహిళ ఒక మోస్తరుగా గాయపడ్డారు. మనామా పశ్చిమ ప్రాంతమైన సానబిస్ గ్రామంలో గురువారం రాత్రి జరిగిన పేలుడులో ఆ మహిళ గాయపడిందని, ఆ వెనువెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ఆ పేలుడుకి తాము బాధ్యులమని ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. జరుగుతున్న పలు సంఘటనలు మెజారిటీ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని అత్యధిక దాడులు జరుగుతున్నాయని, గత రాత్రి జరిగిన ఈ సంఘటన రెండవదని పదిరోజుల క్రితం ఫిబ్రవరి 14 వ తేదీన జరిగిన దాడిలో సిత్ర ద్వీపంకు చెందిన ఇరువురు పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. దీనికి ముందు జనవరి 20 వ తేదీన జరిగిన మరొక ఘటనలో పౌరులను లక్ష్యంగా చేసుకొని సార్ ప్రాంతంలో ఒక ఖాళీ వాహనం పేల్చేందుకు పధకం సిద్ధం చేసుకొన్నారని తెలుస్తుంది.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







