రంగు చూసి ముస్లిం అనుకుంటారా
- February 25, 2017
అమెరికాలో కాల్పులతో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ మృతి పట్ల ఆయన భార్య సునయన తీవ్రస్థాయిలో మీడియా ముందు విరుచుకుపడింది. తన భర్త మృతి వృధా కాకూడదన్నారు. శ్రీనివాస్ హత్యపై అమెరికా సమాజం, అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో సునయన మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఆకారం చూసి.. ఆయన ఓ ముస్లిం అనుకుని దుండగుడు కాల్పులు జరిపాడని చెప్పారు. అసలు రంగు చూసి ఎలా ముస్లిం అనే నిర్ణయానికి వస్తారని ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్యకు కారణమైన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ జాత్యహంకార దాడులతో ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.
అమెరికాపై తన భర్త ఎంతో ప్రేమ చూపించారనీ.. నేవీ రంగానికి ఎంతే సేవ చేయాలనుకున్నారని సునయన వెల్లడించారు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆయన అధైర్యపడలేదని అన్నారు. ఇదిలా ఉంటే..
అమెరికా ఒలేత్ లోని ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్స్ రెస్టారెంటులో షూటింగ్ సంఘటనపై ఎఫ్‌బీఐ విచారణ మొదలుపెట్టింది. ఏవియేషన్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌పై జాతివిద్వేషంతోనే కాల్పులు జరిగాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. రెస్టారెంటులో ఉన్నవాళ్ళంతా టీవీలో వస్తున్న బాస్కెట్ బాల్ మ్యాచ్ చూస్తున్నారని, నిందితుడు పూరింటన్ ఉన్నట్టుండి అసహనంతో గొడవకు దిగాడని సాక్షులు చెప్పారు.
రెస్టారెంటుకు తరచూ వచ్చే గ్రిలిట్ .. పూరింటన్‌ను అడ్డుకున్నాడు. 'ఇది ఫ్యామిలీ రెస్టారెంటు. ఇక్కడ ఇలాంటివి కుదరదు, వెళ్ళిపోవాలని సూచించాడని సాక్షులు చెప్పారు.
అప్పటికే తాగిన మత్తులో ఉన్న పూరింటన్ బయటకు వెళ్లి. కాస్సేపటికే తిరిగొచ్చి 'గెటౌట్ ఆఫ్ మై కంట్రీ' అంటూ కాల్పులు జరిపాడని సాక్షులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







