180 ఫేక్‌ లైసెన్సుల కేసులో నిందితుడిగా ఆర్‌టిఎ మాజీ ఉద్యోగి

- February 25, 2017 , by Maagulf
180 ఫేక్‌ లైసెన్సుల కేసులో నిందితుడిగా ఆర్‌టిఎ మాజీ ఉద్యోగి

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) మాజీ ఉద్యోగి 180 అక్రమ డ్రైవింగ్‌ లైసెన్సుల్ని మంజూరు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 36 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం అప్లయ్‌ చేసుకుంటున్నవారి నుంచి బోగస్‌ ఫైల్స్‌ ఓపెన్‌ చేసి, తగిన డాక్యుమెంట్లు లేకుండా లైసెన్సుల్ని సంపాదించినట్లు విచారణలో తేలింది. 2011కి ముందు నుంచీ ఈ తతంగం నడుస్తోంది. 8 డ్రైవింగ్‌ లైసెన్సులు అనుమానాస్పదంగా కన్పించడంతో తీగ కదిలింది. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి తనకు పాకిస్తాన్‌కి చెందిన ఓ వ్యక్తి 17,000 దిర్హామ్‌లు తీసుకుని లైసెన్స్‌ ఇప్పించినట్లు విచారణలో వెల్లడించారు. మొత్తం 180 లైసెన్సులు ఇలా అక్రమంగా పుట్టుకొచ్చినట్లు అధికారులు నిర్ధారించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com