తప్పకుండా పోటీ చేస్తా 2019 ఎన్నికల్లో
- February 25, 2017
విశాఖపట్నం: వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన తాను బీసీలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో 2019 ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సినీ నటుడు సుమన ప్రకటించారు. ఇదే ఉద్దేశంతో కొంతకాలంగా బీసీల కార్యక్రమాలలో పాల్గొంటున్నానన్నారు. నగర బీసీ యువజన సంఘం శనివారం సుమన్‌ను సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ నటుడిగా కొంతమందికే సేవ చేయగలనని, అదే రాజకీయ బలం వుంటే ఎంతోమందికి సేవ చేయగలనన్న నమ్మకముందన్నారు. తనకు కొన్ని లక్ష్యాలు వున్నాయని, అవి నెరవేరుస్తామని హామీ ఇచ్చిన పార్టీ తరపున పోటీ చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు పితాని ప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈడే మురళీకృష్ణ, టీఎన్‌ఎ్‌సఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు డి.శ్యామ్‌సుందర్ శేషు, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









