కాల్పులు కాబుల్‌లో మసీదు వద్ద
- February 25, 2017
- 11 మంది మృతి
కాబుల్: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఓ మసీదుపై దాడి చేసిన మిలిటెంట్లు 11 మందిని హత్య చేశారు. వారిలో 10 మంది పోలీసు అధికారులు కాగా మరొకరు పోలీస్ కమాండర్ భార్య అని అధికారులు వెల్లడించారు. ఉత్తర జావ్జాన్ ప్రావిన్స్‌లో ఉన్న మసీ దులో పోలీసు అధికారులు ప్రార్థనలు చేసి బయటికి వస్తుండగా వారిపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. తన భర్తపై కాల్పులు జరిగినట్టు తెలుసుకున్న పోలీస్ కమాండర్ భార్య పరుగున అక్కడికి వెళ్లగా ఆమెపై కూడా కాల్పులకు తెగబడ్డారని దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారని భద్రతా అధికారి ఒకరు చెప్పారు. ఐఎస్‌కి చెందిన మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానిక ప్రభుత్వ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







