భార్య పిల్లల పోషణకై 12 ,000 దిర్హామ్ చెల్లించాలని భర్తకు కోర్టు ఆదేశం
- February 26, 2017
వివాహమై నాలుగేళ్లు పూర్తయి..ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ పచ్చని సంసారంలో నిప్పులు పోసుకొంటున్నాడా వ్యక్తి. కట్టుకొన్న భార్యని దారుణంగా హింసిస్తుండటంతో విసిగి వేసారిన ఆమె విడాకులు మంజూరు చేయమని కోర్టుని ఆశ్రయించింది. అబూ ధాబీ కస్సాషన్ కోర్టు ఆ వ్యక్తికి తన భార్య నుంచి వేరుపడాలని ఆదేశించింది. అంతేకాకుండా భార్య ఆ వ్యక్తికి చెందిన ఇద్దరు కుమార్తెల పోషణ నిమిత్తం నెలవారీ 12 ,000 దిర్హామ్ లను ఆర్థిక సహాయం చేయాలని ఒక ఇంటిని ఏర్పాటుచేసి పనులు చేసేందుకు ఒక పనిమనిషిని సైతం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తనను నిత్యం చావబాదుతున్నడని..ఏదో ఒకరోజు ప్రాణం పోవడం ఖాయమని..కనుక క్రూరుడైన తన భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకి అరబ్ స్త్రీ మొరపెట్టుకొంది. అయితే, తానూ ఓ మంచి వ్యక్తినని..తాను ఎన్నడూ ఆమెపై చేయి చేసుకోలేదని కోర్టుకి విన్నవించుకున్నాడు. దీనితో ఆమె భర్త చేతిలో తిన్న దెబ్బల తాలూకా గాయాలని అధికారులకు చూపించింది. అయితే ఆమె భర్తపై దాడి చేసిన నేరంపై ఎటువంటి ఫిర్యాదులు దాఖలు చేయక అతనిని నుండి విడాకులు పొందడానికి మాత్రం కోర్టు సాయం చేయాలని కోరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







