వారిద్దరినీ పక్కనపెట్టాలి టీమిండియాలో మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సూచించాడు
- February 26, 2017
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సూచించాడు. తుది జట్టు నుంచి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్ రౌండర్ జయంత్ యాదవ్‌లను తొలగించి వారి స్థానాల్లో ఇతరులకు అవకాశం ఇవ్వాలన్నాడు.
'టీమిండియా సిరీస్‌ను ఓడిపోతుందని చెప్పడం లేదు. భారత్‌కు గెలిచే అవకాశాలున్నాయి. రెండో టెస్టుకు జట్టులో రెండు మార్పులు చేయడం మేలని భావిస్తున్నా. తుది జట్టు నుంచి జయంత్, ఇషాంత్‌లను తొలగించాలి. భారత్ బ్యాటింగ్ ప్రదర్శనను పరిశీలిస్తే ఓ ఎక్స్ ట్రా బ్యాట్స్‌మన్ అవసరం. కరుణ్ నాయర్‌ను ఆడిస్తే బాగుంటుంది. జయంత్ స్థానంలో అతన్ని బరిలో దించాలి. అలాగే మ్యాచ్‌లు ఆడబోయే పిచ్‌లను బట్టి ఇషాంత్‌కు బదులు భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం ఇవ్వాలి' అని అజర్ అన్నాడు.
తొలి మ్యాచ్ లో భారత్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండో టెస్టు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
తాజా వార్తలు
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!







