చిత్రహింసలు పెడుతున్న సేఠ్, సౌదీ చెరలో మరో మహిళ
- February 27, 2017
సౌదీ చెర నుంచి బయటపడి తిరుపతికి చేరు కున్న షెహనాజ్, భువనేశ్వరిల గాయం మానకముందే మరో మహిళ వ్యథ వెలుగులోకి వచ్చింది. రేణిగుంటకు చెందిన అక్తర్ అనే మహిళ సౌదీలో సేఠ్ పెట్టే చిత్రహింసలను భరించలేక భర్తకు ఫోనచేసి విష యం తెలిపింది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించకుంటే.. ఆత్మహత్య చేసుకుంటానని వాపోయింది. ఆందోళనకు గురైన అక్తర్ కుటుంబీకులు.. ఆమెను ఇండియాకు రప్పించాలని ఇటీవల అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మిని కలిసి వేడుకున్నారు.
బాధితుల కథనం మేరకు.. రేణిగుంట బుగ్గవీధిలో దావూద్, అక్తర్ దంపతులు కాపురం ఉండేవారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రైల్వేస్టేషన్‌లో టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఎడారి దేశం ఆశ చూపింది.
అక్తర్‌కు అదేవీధిలో కాపురముంటున్న బ్రోకర్ ఎస్.షబానా పరిచయమైంది.డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని నెలనెలా జీతంలో పట్టుకుంటా మని ఒప్పించి.. సౌదీలోని దమామ్‌కు అక్తర్‌ను పంపించింది.
ఇలా.. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన సౌదీ వెళ్లిన అక్తర్‌కు రెండు నెలలు మామూలుగానే గడిచిపోయాయి.ఆ తర్వాత సేఠ్ పెట్టే బాధలకు తాళ లేక పోయింది. అక్కడి అఘాయిత్యాలను భర్తకు ఫోన్‌చేసి చెప్పింది. దీంతో బ్రోకర్ షబానాను అక్తర్ కుటుంబీకులు నిలదీశారు. పంపించే వరకే తన బాధ్యతని ఆమె చేతులెత్తేసింది. అంతగా కావాలంటే రూ.5 లక్షలు ఇస్తే ముంబైలోని బ్రోకర్‌తో మాట్లాడి ఇండియాకు తీసుకొస్తా మని చెప్పింది. అసలే పేదకుటుంబం.. రూపాయికి ఆశపడి సౌదీకి పోతే, రప్పించడానికి రూ.5లక్షలు అడిగితే ఏంచేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించారు. వీరిగోడు విన్న ఎస్పీ జయలక్ష్మి రేణిగుంట ఇన్‌స్పెక్టర్‌కు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమన్నారు. రేణిగుంటలో పోలీసులు కేసు అయితే పెట్టారుగానీ.. దర్యాప్తులో మాత్రం వేగం కనిపించడం లేదని అక్తర్ కుటుంబీకులు వాపోతున్నారు. తన భార్యను త్వరగా ఇండియాకు రప్పించే చేయాలని ఎస్పీని దావూద్ వేడుకుంటున్నాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







