'ఇద్దరి మధ్య 18' పాటలు విడుదల
- February 27, 2017
రాం కార్తీక్, భాను త్రిపాఠి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఆడియోను విడుదల చేశారు. ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో శివరాజ్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని ఆచార్య ఈ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు, జీవిత, ఎన్.శంకర్, మల్కాపురం శివకుమార్, సినిమా యూనిట్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న శివరాజ్ పాటిల్..
సినీరంగంలో కూడా రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
చిత్ర నిర్మాత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. సినిమా ఆడియోని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి హరీష్‌రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యూత్‌ని ఆట్టుకునే అన్ని కమర్షియల్ హంగులతో, ఒక చక్కని మెసేజ్‌ను మిళితం చేసి దర్శకుడు నాని ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయని చెప్పారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు వెల్లడించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. తనకు ఇది 50వ చిత్రమని చెప్పారు. సంగీత దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ తనకు ఈ చిత్రంతో ఆరంభం అవుతోందని, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







